EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రభుత్వ శాఖలలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 25:

_______________________________

బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న 8,000 మంది తాత్కాలిక టీచర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని రాజ్యసభ సభ్యులు,బిసి సంక్షేమ సంఘం అధ్యకులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్ లో జరిగిన రాష్ట్ర తాత్కాలిక ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ 10, 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వీరిని రెగ్యులరైజ్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పులు ఉన్న విషయాన్నీ ఆ సందర్బంగా కృష్ణయ్య గుర్తు చేశారు.అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో లక్షలాది మంది తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేశారు. మన రాష్ట్రంలో గతంలో కాంట్రాక్ట్ డేలివేజ్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారు. కానీ ఇంకా అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, గెస్ట్ టీచర్, గెస్ట్ లెక్చరర్లు వేల సంఖ్యలో ఉన్నారు. వీరికి అన్యాయం జరుగుతుంది, శ్రమ దోపిడీ జరుగుతుంది.మన రాష్ట్రంలో కూడా ఇదే పద్ధతిలో పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలు గడుస్తున్న జీతాలు పెరగడం లేదు. కుటుంబ పోషణ భారం పెరిగింది. పిల్లల ఫీజులు, ఇంటి అద్దె చెల్లించలేక ఉద్యోగులు ఇబ్బందులకు గురువుతున్నారు.

వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని ఒక విధాన నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఈ సమావేశం లో నీలా వెంకటేష్,సి.రాజేందర్,ఆనంతయ్య.అల్లం యాదయ్య,రామానుజ నేలు,బాలయ్య.తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top