EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రాణం కంటే ఎర్ర జెండా పార్టీనే మిన్నగా భావించిన కామ్రేడ్ అమరజీవి లాల్ సింగ్.

29-07-2025 ఈ తరంభారతం హైదరాబాద్ :

ప్రాణం కంటే పార్టీని మిన్నగా భావించిన కామ్రేడ్ అమరజీవి లాల్ సింగ్ అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో లాల్ సింగ్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఇది తెలుసుకున్న పార్టీ జిల్లా నాయకత్వం ఈరోజు ఉదయం 9:30 గంటలకు లాల్ సింగ్ స్వగృహము బోసు సెంటర్ నందు వచ్చి లాల్ సింగ్ భౌతికయానికి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం లాల్ సింగ్ భౌతిక కాయానికి ఎర్రజెండా కప్పి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాల్ సింగ్ ఇల్లే పార్టీ కార్యాలయం తలపించే విధంగా ఉంటుంది.లాల్ సింగ్ మరణం పార్టీకి కళారంగానికి తీరనిలోటని ఆయన ప్రాణం పోయేంతవరకు పార్టీకి కట్టుబడి ఉన్నారని అనారోగ్యంతో ఉన్నా సరే పార్టీ విషయాలు తెలుసుకుని కార్యకర్తలతో పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో విషయాలు చెప్పేవారని కళారంగా అభివృద్ధి కోసం కూడా చాలా విషయాలు చెప్పేవారని ప్రజానాట్యమండలి దళంలో డప్పు దళంలో డప్పు కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవాడు లాల్ సింగ్ ప్రజానాట్యమండలి ఏ బాధ్యత ఇచ్చిన ఆ బాధ్యతని సక్రమంగా పూర్తిగా నిర్వహించిన లాల్ సింగ్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని విచారకరమని లాల్ సింగ్ ఆశయ సాధన కోసం మనమందరం కూడా పనిచేయాలని ఆయన అన్నారు. అనంతరం ప్రజానాట్యమండలి జిల్లా నాయకత్వం కూడా ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయనకు నివాళులర్పించిన వారిలో సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా. శ్రీనివాసరావు, కళ్యాణము వెంకటేశ్వరరావు, తుమ్మ విష్ణువర్ధన్, షేక్ మీరా, బండారు రమేష్, సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు, సిపిఎం త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు 31 డివిజన్ కార్పొరేటర్ యర్రా గోపి,వజేనేపల్లి శ్రీనివాసరావు, పత్తిపాక నాగ సులోచన, బండారు వీరబాబు, బండారు యాకయ్య,షేక్ హిమామ్, ఎర్ర రంజిత్, ఎర్ర మల్లికార్జున్, షేక్ బాబు, వేల్పుల నాగేశ్వరరావు,పోతురాజు జార్జి, రంగు హనుమంత చారి, ఎర్ర నగేష్, షేక్ మస్తాన్, బండారు సునీత, ప్రజానాట్యమండలి జిల్లా నాయకత్వం జిల్లా కార్యదర్శి వేముల సదానందం,నందిగామ కృష్ణ,లింగయ్య,మల్లయ్య, ఆంటోనీ, డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top