ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 24 :హైదరాబాదులో ఘోరం జరిగింది. మేడిపల్లి బాలాజీహిల్స్ లో మహేందర్ రెడ్డి 5నెలల గర్భవతి అయిన తన భార్య స్వాతి (21)ని చంపి, ముక్కలుగా నరికాడు. శరీర భాగాలను బయట పడే:::సేందుకు ప్యాకింగ్ చేస్తుండగా శబ్దాలు విని చుట్టుపక్కల వాళ్లు గుర్తించారు. పోలీసులకు సమచారం ఇవ్వగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ (D) కామారెడ్డిగూడకు చెందిన మహేందర్.. స్వాతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మొండెం కవర్లో.. కాళ్లు, చేతులు, తల ఎక్కడో..! హైదరాబాద్లో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త.భ ర్తది రెడ్డి సామాజిక వర్గం.. భార్యది యాదవ సామాజిక వర్గం. ఇద్దరూ నలుగురికి ఆదర్శం అనిపించేలా ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ జీవితంలో మాత్రం ఆదర్శంగా బతకలేకపోయారు. భార్యభర్తల మధ్య ఏం గొడవలు ఉన్నాయో తెలియదు కానీ.. భార్యను అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి కవర్ లో ప్యాక్ చేశాడు భర్త. ఈ ఘటన హైదరాబాద్ లో శుక్రవారం(ఆగస్టు 23) రాత్రి చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ కామారెడ్డిగూడ కు చెందిన మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన యాదవ కులానికి చెందిన స్వాతి(22 అలియాస్ జ్యోతి)ని ప్రేమ వివాహం చేసుకున్నారు. 25రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బోడుప్పల్ లోని బాలాజీహిల్స్ లో అద్దెకు ఉంటున్నారు. మహేందర్ రెడ్డి రాపిడో నడుపుతున్నాడు. స్వాతి గర్భవతి అని స్థానికులు అందించిన సమాచారం ప్రకారం తెలిసింది. హత్య గురించి మహేందర్ రెడ్డి బంధువు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.గతంలో ఇద్దరు ఇదే ప్రాంతంలోని ఇదే ఇంట్లో ఓ పది నెలలు ఉండి వెళ్ళినట్లు స్థానికులు చెప్తున్నారు. మళ్ళీ 25 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఉంటున్న వీళ్ల మధ్య ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.
మొండెం కవర్లో.. కాళ్లు చేతులు, తల ఎక్కడో..
మహేందర్ రెడ్డి తన భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. బాడీని ముక్కలు ముక్కలుగా నరికి.. మొండెంను కవర్ లో ప్యాక్ చేశాడు. కాళ్ళు, చేతులు, తల వేరు చేసి ఎక్కడో వేసినట్లు తెలుస్తోంది. వాటి కోసం పోలీసులు వెదుతుకున్నారు. ఇంట్లో ఛాతీ భాగంమాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.















