EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఫీజులు ఇస్తావా.. గద్దె దిగుతవా.. సీఎం తేల్చుకోవాలి అఖిలపక్ష పార్టీలు విద్యార్థి మేధావుల సమావేశంలో నేతల వెల్లడి

హైదరాబాద్ ఫిబ్రవరి 24 ఈతరం భారతం:

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముచ్చటగా మూడవసారి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న గత ఐదు సంవత్సరాలుగా ఉన్న 7వేల కోట్ల ఫీజుల బకాయిలు మాత్రం విడుదల చేయకుండా పేద విద్యార్థుల ఉసురు తీసుకుంటుందని అఖిలపక్ష పార్టీల నేతలు విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకపడ్డారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థుల కన్నీటి చదువులు అనే అంశంపై అఖిలపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు మేధావులు బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల విస్తృతస్థాయి సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ అధ్యక్షత వహించగా జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ సమన్వయం చేశారు.సమావేశంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, టిఆర్ఎస్ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ విటల్, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, తదితరులు హాజరయ్యారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యాపై పెట్టిన పెట్టుబడిని పెట్టుబడి కోణంలో చూడకుండా మానవ వనరుల అభివృద్ధిగా చూడాలన్నారు, ముఖ్యంగా బడుగుల విద్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి తగదని తక్షణమే పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజుల బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.. బిజెపి పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంట్ సమస్యను ప్రైవేట్ కళాశాల యజమాన్యాల సమస్యగా చూస్తుందని, ఈ సమస్య రాష్ట్రంలో ఉన్నత విద్యను చదువుకుంటున్న లక్షల మంది విద్యార్థుల బాధగా చూడాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని మార్లు విన్నవించిన ప్రభుత్వం బండరాయిలా మాదిరిందని కనీస స్పందన లేదని విమర్శించారు ఒకవైపు వాస ప్రభుత్వం వేల కోట్లు అప్పులు మీద అప్పులు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు, పాత బకాయిలు మేమెందుకు ఇస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలలో రావలసిన రాబడిని బకాయిల రూపంలో వసూలు చేస్తుందని, ప్రభుత్వానికి రావలసిన పాత బకాయిలు వసూలు చేసినప్పుడు, విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.విద్యార్థుల శక్తిని, తెలంగాణ సమాజ పోరాట చరిత్రను రేవంత్ రెడ్డి తక్కువ అంచనా వేస్తున్నాడని, ఈ వైఖరి మార్చుకోకపోతే విద్యార్థులు తెలంగాణ సమాజం ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వం గద్ద దింపడానికి సిద్ధంగా ఉన్నారని ఈటల హెచ్చరించారుమాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎల్ రమణ లు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క లేదని, అసెంబ్లీలో, బయట ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని పోరాటం చేస్తుంటే ప్రభుత్వం నయా పైసా కూడా విడుదల చేయకుండా పేద విద్యార్థులను ఉసురు తీసుకుంటుందని వారు తీవ్రంగా విమర్శించారు.ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటానికి టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, బకాయిల విడుదల కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు .బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చలనం లేని గాంధీ విగ్రహానికి 5 వేల కోట్లు ఖర్చు పెడతామని చెబుతున్న ప్రభుత్వం, 22 లక్షల మంది పేద విద్యార్థులు ఫీజుల రియంబర్స్మెంట్ రాక ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి కనికరం లేదని గాంధీ విగ్రహానికి అయ్యే ఖర్చు ఫీజుల రియంబర్స్మెంట్కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఫీజుల రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే బీసీ సమాజ ఒప్పుకోదని ఆయన తెలిపారు దేశంలో ఒకవైపు ఏఐ జాతీయ సెమినార్ జరుగుతుంటే ఇంకొక వైపు ఫీజులు చెల్లించలేక పేద విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం సర్కార్ కు సిగ్గుచేటని, గత రెండు సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ లో పేదలకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో , బడా కాంట్రాక్టర్లకు ఎన్ని నిధులు విడుదల చేశారు శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ ఉన్నప్పటికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల ఫీజుల నిధులు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మనసు రావడంలేదని, బడా కాంట్రాక్టర్లకు వేలకోట్లు దోచిపెడుతున్న ప్రభుత్వం బడుగుల విద్యకు నయాపైసా విధించకుండా అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు తక్షణమే విడుదల చేయాలని రెండు రోజుల్లోనే సిఎస్ ను, బీసీమంత్రులను, డిప్యూటీ సీఎంలను కలుస్తామని వారి నుంచి సానుకూల స్పందన రాకుంటే మార్చ్ 16వ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు ఈ సమావేశంలో బిసి జేఎసి వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ , ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు హేమ సబీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ గారు, రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సాగర , మహిళా సంఘం అధ్యక్షురాలు మని మంజరి గబీసీ ఉద్యోగుల సంఘం చంద్రశేఖర్ గౌడ్ , ప్రొఫెసర్ చలమల వెంకటేశ్వర్ గారు, బీసీ జేఏసీ జాజుల లింగం,టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్,పీడీఎస్ యు జనరల్ సెక్రెటరీ రాజేష్ గారు టిఆర్ఎస్వి జనరల్ సెక్రెటరీ జంగయ్య, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు శివరాజ్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ నాయక్, బీసీ విద్యార్థి జెఎసి చైర్మన్ బొల్లెపల్లి స్వామి, ఓ.యు జెఎసి నాయకులు విజయ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

 

 

Related News

Select the Topic
Scroll to Top