ఈతరం భారతం హైద్రాబాద్ జులై 11 :
ఫీజుల రియంబర్స్మెంట్ పై గత నెల రోజులుగా అన్ని విద్యాసంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నారు. కానీ ముఖ్యమంత్రి దిగి రాకపోవడం దుర్మార్గమని రాజ్య సభ సభ్యులు జాతీయ బి.సి సంక్షేమ సంఘంజాతీయ అధ్యక్షులు -ఆర్. కృష్ణయ్య విమర్శించారు. శనివారం బిసి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ విద్యార్థిలోకం, వారి తల్లిదండ్రులు, సభ్య సమాజం లోకమంతా కూడా కోడై కూస్తున్న ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు. బిజెపి బాగా14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, జీవో నెంబర్ 9ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ విద్యార్థులకు డిమాండ్ పెద్ద ఎత్తున్న యున్నందున 150 బిసి గురుకుల పాఠశాలలు, 120 బిసి కాలేజీ హాస్టల్ లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం బి.సి గురుకుల పాటశాల అడ్మిషన్లకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు రాగా వేల మందికిమాత్రమే సీట్లు ఇచ్చారు. ఇంకా లక్షల సంఖ్యలో విద్యార్థులు సీట్లు లభించక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. బీసీ గురుకుల పాఠశాల అడ్మిషన్ల గురించి రోజు వందలాది > మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అడ్మిషన్లు కావాలని తెలుగు సంక్షేమ భవన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు బాగుపడాలని ఆవేదన చెందుతున్నారన్నారు.
ప్రస్తుతం అవసరాలకు తగ్గట్లు పెంచాలి. సీట్లు లభించడం లేదు వేలాది మంది విద్యార్థులు సీట్లు దొరకక ఇబ్బందులకు గురవుతున్నారు ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు బరించలేక చదువు మానుకుంటున్నారు కావున వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ కింది జిల్లాలలో తగురీతిగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఈ నెల 14 సత్యాగ్రహ దీక్షా – 16న కలెక్టరేట్ల ముట్టడి,నెల 14న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షా మరియు 16న కలేక్తరెట్లు ముట్టడి జరపాలని నిర్ణహించినట్లు తెలిపారు















