ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 5 :
ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేసి అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సికింద్రాబాద్ జిల్లా SR నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కన్వీనర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, విద్యా సామగ్రి లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులతో విద్యను వ్యాపారంగా మార్చాయని విమర్శించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్‌లు అందించాలని కోరారు.
ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు కచ్చితంగా అమలు చేయాలనిప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిద్దు, టౌన్ కార్యవర్గ సభ్యుడు జీవన్,వంశీ, హర్ష, ప్రణవ్, సాయి చరణ్, కార్తీక్, జోయెల్, గగన్, సాయి తరుణ్, నవనీత్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు…














