EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఫోన్ ట్యాపింగ్ కేసు..  సిట్ నుంచి తీన్మార్ మల్లన్నకు పిలుపు

ఈ తరంభారతం హైదరాబాద్ జూలై 16 :ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్నా కొద్దీ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల సంఖ్య మరింత పెరుగుతోంది.ఇప్పటి వరకు 269 మంది బాధితుల స్టేట్‌మెంట్‌ను సిట్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు 4,200లకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో అన్ని పార్టీల నాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, మీడియా, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణ ఎన్నికల్లో భాగంగా ప్రభాకర్ రావు టీమ్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో కేసులో విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న సిట్ సమాచారం అందజేసింది. ఈ మేరకు గురువారం ఆయన జూబ్లీహిల్స్ పీఎస్‌కు వెళ్లి స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు.

Related News

Select the Topic
Scroll to Top