జూలై 27 (ఈతరం భారతం ) హైదరాబాద్ ;బిఆర్ఎస్ పార్టీలో ఎన్నో చెంచాలు ఉన్నాయని, అందులో కౌశిక్ రెడ్డి చెంచా జర చప్పుడు ఎక్కువ చేస్తోందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు.ఆదివారం గాంధీ భవన్ లో మీడియా సమావేశ్జం లో మాట్లాడుతూ చెంచా కౌశిక్ రెడ్డి జర చెంచా చప్పుడు మానుకో ఇదే నా లాస్ట్ వార్నింగ్ అని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి కథలు ఎక్కువయ్యాయి. తగ్గించుకోకపోతే ఇరిచేస్తా చెంచా కౌశిక్ రెడ్డి నీ స్థాయి తెలుస్కుని మాట్లాడు సీఎం రేవంత్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు చెంచా కౌశిక్ గతంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నపుడు సీఎం రేవంత్ రెడ్డి..కౌశిక్ చెంచా ఎందుకు పనికిరాదని పట్టించుకోలేదు సారు కారు పదహారు అని…సారు కారు పరారయ్యారు కదా దాని గురుంచి మాట్లాడు చెంచా .. సీఎం రేవంత్ గురించి నోటికొచ్చింది మాట్లాడితే చెంచాకి పట్టిన గతీ నీకు పడుతుందన్నారు. మొగోడివైతే రా చెంచా కౌశిక్ తేల్చుకుందాం పక్క రాష్ట్రం నుంచి కిరాయి రౌడీలను తెచ్చుకున్న వదిలిపెట్టే ప్రసక్తే లేదుఇది స్వీట్ వార్నింగ్ కాదు డెడ్లి వార్నింగ్ అని సాయి కుమార్ హెచ్చరించారు.















