ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 1;
అఖిల్ భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్రఅధ్యక్షులు కౌలే జగన్నాధం ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల కమీషన్ చైర్మన్ అయిన గోపిశెట్టి నిరంజన్ ని మరియు ఇతర కమిషన్ అధికారులను ఖైరతాబాద్ లోని వారి ఆఫీసులో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల జేసిన కులగణన సర్వే రిపోర్టులో పంచ వృత్తులైనవడ్రంగి, స్వర్ణకార, కమ్మర, కంచరి మరియు శిల్పుల జనాభాను విడి విడిగా కాకుండా ఏకీకృతంచేసి విశ్వబ్రాహ్మణ/ విశ్వకర్మ అని ఒకే కులం క్రింద పరిగణించవలెనని మరియు జనాభా దామాషా ప్రకారంగా అన్ని రకాల రిజర్వేషన్ లు కల్పించాలని మనవి చేస్తూ విజ్ఞాపన పత్రము అందజేయడం జరిగినది .దానికి ఆయన సానుకూలంగా స్పందించిన బిసి కమిషన్ చెర్మెన్ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి హాజరైన , పడాల సతీష్ చారి అధికార ప్రతినిధి, కనపర్తి లక్ష్మణ్ చారి గౌరవ సలహాదారు, కాసోజు శ్రీనివాస్ చారి ఉపాధ్యక్షులు, కస్తోజు శ్రావణి మహిళా అధికార ప్రతినిధి , మూట కోడూరు పద్మశ్రీ అధ్యక్షులు కల్చరల్ కమిటీ మరియు కె లోకనాథం EC మెంబర్ తదితరులు పాల్గొన్నారు .














