హైదరాబాద్ మార్చ్ 20 ఈతరం భారతం :
బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శిగా దండుగుల కృష్ణ నియమితులయ్యారు ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం మూలంగా అనేకమంది పేద బీసీ విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను లను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం దండుగుల కృష్ణ మాట్లాడుతూ తనపై గల నమ్మకంతో తనకు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శిగా నియమించిన ఆర్.కృష్ణయ్యకు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డా.ర్యాగ అరుణ్ కుమార్ అలాగే తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎత్తరి భీమ్రాజ్ లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో రాజేందర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు















