EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భట్టి ఆదేశాలతో రెచ్చిపోయిన కరెంటోళ్లు ఎలుకల బెడదను తప్పించేందుకు ఇల్లు తగులబెట్టుకున్నట్టు..మైండ్‌లెస్‌ యాక్షన్‌’ అంటూ నెటిజన్ల సెటైర్లు కరెంటు తీగలను సరిచేయలేక కేబుళ్లు కట్‌

హైదరాబాద్ ఆగష్టు 20 (ఈతరం భారతం )పిచ్చి కుదిరింది.. తలకు రోకలి చుట్టమన్నాడట! కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరు కూడా అలాగే ఉంది. రామంతాపూర్‌లో కృష్ణరథయాత్రలో విద్యుత్తు తీగలు తగిలి ఐదుగురు చనిపోయిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు నగరంలో హాహాకారాలు సృష్టించాయి. ఎలుకల బెడదను తప్పించేందుకు ఇల్లు తగులబెట్టుకున్నట్టు.. వేలాడుతున్న విద్యుత్తు తీగలను సరిచేయలేక, మొత్తం అన్ని కేబుల్‌ వైర్లనూ కత్తిరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలివ్వడంతో కరెంటోళ్లు ఎక్కడికక్కడ రెచ్చిపోయారు. ఇంటర్నెట్‌, కేబుల్‌ వైర్లను కట్‌ చేసిపారేశారు. దీంతో నగరంలో చాలా ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. కరెంటు తీగలను సరిచేయలేక కేబుళ్లు కట్‌చేయడం తో నగరంలో ఇంటర్నెట్‌, డిష్‌ సేవలు నిలిచి పోయాయి.కనెక్షన్ల కత్తిరింపుపై లక్షకు పైగా ఫిర్యాదులు వస్తున్నట్లు .అందినట్టు ఇంటర్నెట్‌ ప్రొవైడర్స్‌ వెల్లదించింది.ఎప్పటి వరకు జరిగిన నష్టాన్ని అంచనావేయలేం సీవోఏఐ డీజీ పేర్కొన్నారు.ఇగురం లేని పనితో ప్రజలకు తలనొప్పులు,‘మతిలేని చర్య’ అంటూ నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వర్క్‌ ఫ్రం హోం’ ఉద్యోగులకు తిప్పలు తప్పలేదు.‘మైండ్‌లెస్‌ యాక్షన్‌’ అంటూ నెటిజన్ల సెటైర్లు వేస్తున్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top