ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 13
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య LIAFI 1964 జనరల్ బాడీ సమావేశాన్ని ఈ నెల 17,18 వ తేదీన నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు క్లియ చైర్మన్, జనరల్ బాడీ సమావేశ అడ్వైజర్ బోర్డు కో చైర్మన్ కౌటికే విఠల్ తెలిపారు.ఈ సందర్భంగా భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య సమావేశం లో కౌటికే విఠల్ మాట్లాడుతూ ఈ నెల 17,18 న జరిగే సమావేశం లో 3000 వేల మందికి పైగా సాధారణ మండలి సభ్యులు, liafi జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు, ప్రతినిధులు పాల్గొంటారు అని తెలిపారు.ఈ సమావేశం లో ఏజెంట్లు మరియు పాలసి దారులకు సంబందించిన కీలక అంశాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నామని తెలిపారు. ఏజెన్సీ బలగాన్ని మరింత బలోపేతం చేయడానికి, పాలసీ దారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి వ్యూహలను రూపొందించునున్నారు.ఎజెంట్ల ప్రయోజనాలను కాపాడటం, నైతిక భీమా విధానలను ప్రోత్సహించడం, భారతదేశ బీమా రంగ అభివృద్ధికి తోడ్పడటం పట్ల తన నిభద్దతను పునరుద్గాటిస్తుంది అని తెలిపారు. పాలసీదారుల కు సంబంధించిన అంశాలపై సంబంధిత పై అధికారులకు వినతులు సమర్పిస్తామని తెలిపారు. ఈ సమాఖ్య భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని సమాఖ్య సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొనే అందరికీ తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్ బి శ్రీనివాసచారి మాట్లాడుతూ liafi సీనియర్ నాయకుల గత కార్యకలాపాలు,సలహాల ను స్వీకరించి సమాఖ్య బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు.రాజ్యాంగ కమిటీ చైర్మన్,అడ్వైజరీ పోటీ చైర్మన్ బి ఎన్ చారి, స్వాగత కమిటీ చైర్మన్ సింగారపు శ్రీనివాస్, ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్మన్ షేక్ షాజహాన్, వైస్ ప్రెసిడెంట్ ఎమ్మెస్ మూర్తి, కోశాధికారి బి శ్రీరామ్ మహిళా ప్రతినిధి హేమలత, సికింద్రాబాద్ డివిజన్ కార్యదర్శి సునీల్ కుమార్, హైదరాబాద్ డివిజన్ కార్యదర్శి సీనయ్య, పబ్లిసిటీ కో చైర్మన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.















