హైద్రాబాద్ ఆగస్ట్ 17 ఈతరం భారతం :మహిళలు రాజకీయంగా చైతన్యం తెచ్చుకొని ప్రజాసేవలో ముందంజలో ఉన్నప్పుడే మహిళా సాధికారికత సులభంగా సాధ్యమవుతుందనిమాజీ స్పీకర్ మధుసూదన చారి అన్నారు. ప్రముఖ సంఘ సేవకురాలు సామాజికవేత్త లలిత కుమారి పుట్టినరోజు పురస్కరించుకొని మధుసూదన చారి శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో సమభాగం ఉన్న మహిళలను కేవలం ఓటును దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయ పార్టీలు నిస్వార్ధంగా మహిళలను ప్రోత్సహించి రాజకీయాలలో ఉన్నత పదవులు పొంది మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు దీనికి స్వచ్ఛంద సేవా సంస్థలు సంఘ సేవకులు కూడా సహకరించి ప్రోత్సహించాలని తెలిపారు అప్పుడే మహిళలు సుఖశాంతులతో జీవించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు















