ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 18
మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటినిబిజెపి ముట్టడించింది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర రోడ్దుపై బిజెపిస్టేట్ మీడియా ప్యానెలిస్ట్ డా. ప్రభా గౌడ్ బైఠాయించి నిరసనటిలిపింది. దీనితో ఆమెనుపోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్బంగా డా.. ప్రభా గౌడ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ గారు 33% రిజర్వేషన్లతో ‘మహిళా నేతృత్వంలో అభివృద్ధి’కి బాటలు వేస్తుంటే, కాంగ్రెస్ మరియు ‘ఇండి’ కూటమి కుట్రపూరితంగా దానిని అడ్డుకుని తమ మహిళా వ్యతిరేకతను బట్టబయలు చేసుకున్నాయని..విమర్శించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ముమ్మాటికీ మహిళా ద్రోహులు అని ఆమె మండిపడ్డారు.
మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కూటమి కాలకూట విషం కక్కిందని, మహిళలందరినీ ఓడించినందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూటమి సంబురాలు చేసుకుంటుందని.. ప్రతి తల్లి, అక్కా, చెల్లి ఇలా అందరికీ ఇది అవమానకరమైన రోజు అని అన్నారు.
త్వరలోనే మహిళలంతా కలిసి కాంగ్రెస్ కూటమికి బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో మహిళలంటే కేవలం ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలు మాత్రమే కావచ్చు అని అన్నారు.
డీలిమిటేషన్ సాకుతో, ఎక్కడ మహిళలు చట్టసభల్లోకి అడుగుపెట్టి బిజెపికి క్రెడిట్ ఇస్తారో అన్న అక్కసుతో ఈ బిల్లును నిలిపివేయడం యావత్ మహిళా లోకానికి, వారి హక్కులకు జరిగిన ఘోర అవమానం చేశారన్నారు. డూప్లికేట్ గాంధీ. స్టాలిన్, అఖిలేష్ కుటుంబాల మహిళలకు మాత్రమే పదవులుండాలా?
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీకి మైలేజీ రావొద్దని రాత్రికి రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కుట్ర చేశారని, ‘నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తాను’ అని ఒకరికొకరు డ్రామాలాడుతున్నారని అన్నారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని డా.. ప్రభా గౌడ్ మండిపడ్డారు.















