EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మహిళా రిజర్వేషన్ బిల్లు’ పై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆర్ పి ఐ(ఏ) ధర్నా

ఈ తరం  భారతం హైద్రాబాద్ మే 11:

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కు మద్దతుగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)’సోమవారం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి శివ నాగేశ్వరరావు మాట్లాడుతూగౌరవనీయులైన అమ్మా,భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా,గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన చారిత్రాత్మక ‘నారీ శక్తి వందన్ అధినియం’ (మహిళా రిజర్వేషన్ బిల్లు) పట్ల మా ‘రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)’ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోందన్నారు చట్టసభల్లో మహిళలకు 33% వాటా కల్పించడం అనేది దేశాభివృద్ధిలో ఒక కీలక మైలురాయి.

భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుకన్న మహిళా సాధికారతను నిజం చేస్తూ, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే  ప్రభుత్వం చారిత్రాత్మకమైన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ను తీసుకురావడం జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామమన్నారు. ఇది మహిళా లోకానికి దక్కిన గొప్ప అదృష్టంగా మా పార్టీ భావిస్తోంది.

అయితే, మహిళలకు ఇంతటి గొప్ప మేలు జరుగుతుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గే మరియు వారి మిత్రపక్షాలు ఈ బిల్లు పట్ల వ్యవహరించిన తీరు, వారి వ్యతిరేక వైఖరి అత్యంత విచారకరం. ఇది ఆ పార్టీకి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి లేమిని తెలియజేస్తోంది.

ఈ నేపథ్యంలో, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన మా ‘రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)’ జాతీయ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు అయిన రాందాస్ అథవాలే ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ బిల్లుకు అనుకూలంగా నిర్వహించిన ఈ ధర్నాలో రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ నాయకులు డాక్టర్ సంఘం శ్రీధర్, రాష్ట్ర నాయకులు దాచారపు శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డి రవికుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆర్పీ నీల, పొలిటికల్ ఉమెన్స్ అధ్యక్షులు గంగాపురం పద్మ, జగన్నాథం రాజిరెడ్డి, అసేంట్ ఓనర్ సెక్రెటరీ ఎన్ ఆర్ సి రాజు, ఏఐఆర్ఆర్టీ సెక్రెటరీ నర్సింగ్ రావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సాంబ తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top