హైద్రాబాద్ మార్చ్ 8 ఈతరం భారతం:
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల హక్కులు, సాధికారతపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రతి యేటా మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని రాష్ట్ర మంత్రి అడూరి లక్ష్మణ్్కుమార్ సతీమణి అడూరి కాంతకుమారి అన్నారు. 1914 నుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజు ఈ మహిళల పండుగను ఆచరిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు కాంతకుమారి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకప్పుడు సమాజంలో స్త్రీ పురుష వివక్ష తీవ్రంగా ఉండేదని, ఆ అంతరాలను అధిగమించేందుకే ఈ దినాన్ని ఆచరిస్తామన్నారు. ఈ పండుగను మాటలతో గాకుండా ఆచరణలో మహిళా సాధికారతకై కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న క్రమంలో మహిళా సాధికారత వైపు ప్రభుత్వాలు అడుగులు వేయడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ పదవులతో పాటు పార్టీ పదవుల్లో సైతం మహిళలకు గుర్తింపునిస్తున్నారని కాంతకుమారి చెప్పారు.















