ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 14
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మహోన్నత విలువలను భారతదేశానికి అందించిన మహా వ్యక్తి బి ఆర్. అంబేత్కర్ అని రెడ్ క్రాస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భీమ్ రెడ్డి అన్నారు. బీఆర్ అంబేత్కర్ 135 జయంతి పురస్కరించుకొని దోమలగూడలోనిభారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, కార్యాలయం నుండి ట్యాంక్ బ్యాండ్ అంబేత్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన జండా ఉపీ ప్రారంభించారు.ఈ సందర్బంగా భీమ్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి స్వార్థం లేకుండా కుటుంబన్ని సహితం పక్కన పెట్టి దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగ నిర్మాతగా భారతదేశానికి దిక్సూచిగా నిలిచిన మహానుభావుడని కొనియాడారు.అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ బాల భటుల ఉద్యమము ప్రతి విద్యార్థికి చేరే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి , ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు తప్పనిసరి ఇందులో చేరే విధంగా ,చర్యలుతీసుకున్నారు,
ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇప్పించి , రాష్ట్ర ప్రభుత్వము ద్వారా ప్రత్యేక నిధులను కేటాయించి వారికి ప్రోత్సాహమును ఇస్తున్నందుకు స్కౌట్ వ్యవస్త ఉపిరి పీల్చుకొని పరుగులు పెడుతతొందన్నారు.ఈ కార్యక్రమం లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్,హైద్రాబాద్ జిల్లా,సెక్రటరీ వి. లక్ష్మణ్ నాయక్ , జగదీష్ తదితరులు పాల్గొన్నారు.















