EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్

ఈతరం భారతం  హైద్రాబాద్ మే 30;

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రికత అనంతరం తెలంగాణ భవన్‌ వద్ద సుమన్‌ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సుమన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తనను మరోసారి జైలుకు పంపాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్‌ నిర్ణయించారన్న సుమన్.. జైల్లో పెట్టి పైశాచికానందం పొందాలని భావిస్తున్నారని ఆరోపించారు.

వివిధ సెక్షన్లపై కేసునమోదు : మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలంటూ ఇటీవల బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో.. సుమన్‌పై 326(జి), 351(3), 353(1)(బి), రెడ్‌ విత్‌ 55, రెడ్‌ విత్‌ 61(2)(ఎ), బీఎన్‌ఎస్‌ 4 పీడీపీపీఏ కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు గో బ్యాక్ అంటూ : బాల్క సుమన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావడంతో కొంతసేపు తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గో బ్యాక్ అంటూ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులతో బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు మాట్లాడారు. నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశామని, అందువల్ల ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

Related News

Select the Topic
Scroll to Top