EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మార్చ్ 3 న చంద్ర గ్రహణం..పాటించవలసిన నియమాలు

హైదరాబాద్ ఫిబ్రవరి 27 ఈతరం భారతం:

చంద్ర గ్రహణం ఫాల్గున శుక్ల పూర్ణిమా మంగళవారము 03-03-2026 నాడు సింహరాశిలో పూర్వఫల్గునీ నక్షత్రమున కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును.స్పర్శ కాలం పగలు 03:20,సూర్యాస్తమయం (హైదరాబాద్) సాయంత్రం 06:23,మోక్ష కాలం రాత్రి 06:47,మొత్తం పుణ్యకాలం 00:24

గ్రహణ ఆరంభము ప గం. 03:20 అయినను పుణ్యకాలము మాత్రం సూర్యాస్తమయము/ చంద్రోదయం నుండి ప్రారంభమగును.

-: నిత్య భోజన ప్రత్యాబ్దికాది నిర్ణయము :-

ఇత్యాది శాస్త్రవాక్యములను బట్టి సమర్థులు ఈరోజు పగలు ఏ రకమైన ఆహారాదులు తీసుకొనకూడదు. శుద్ధ మోక్షానన్తరము (రా 06:47 తరువాత) నిత్యభోజన, ప్రత్యాబ్దికములను ఈ రాత్రియే యథాప్రకారము జరుపుకొనవలెను. అశక్తులు (పిల్లలు, రోగగ్రస్థులు, గర్భిణులు, వృద్ధులు) ఈనాడు పగలు గం.11:00 లోపు భుజింప వచ్చును.ఈనాటి రాత్రికాలమున శ్రాద్ధాచరణము విశేష ధర్మ శాస్త్రమును బట్టి నిర్ణయము. అయితే విధవాకర్తృకశ్రాద్ధ మగుచో ఈ రోజు (పగలు రాత్రి) ఉపవసించి మరునాడే జరుపవలసియుండును. అట్లే ఈనాడు జరుపవలసిన విశేష పూజాదులన్నియు గ్రహణానంతరమే జరుప కొనవలయును.

గ్రహణ గోచారము :- ఈ గ్రహణమును పూర్వఫల్గుని నక్షత్రము వారును, పూర్వాషాఢ నక్షత్రము వారును, భరణి నక్షత్రము వారును, అధమ ఫలము నిచ్చు రాశుల వారును అసలు చూడరాదు.

శుభ ఫలము : మిథున, తుల, వృశ్చిక, మీన రాశులవారలకు

మధ్యమఫలము : మేష, కర్కాటక, ధనుః, కుంభ రాశులవారలకు

అధమ ఫలము : వృషభ, సింహ, కన్య, మకర రాశులవారలకు.

కొన్ని ముఖ్యమైన సూచనలు:

సూర్యగ్రహణము సంభవించే ఝాము (యామము) నకు పూర్వపు నాలుగు ఝాములు (సుమారు 12 గంటలు) ముందుగా ఎటువంటి ఆహారము తినరాదు. చంద్రగ్రహణమునకు పూర్వపు మూడు ఝాములు (సుమారు 9 గంటలు) ముందుగా తినరాదు. 7 సం॥ వయస్సు లోపు పిల్లలకు, వృద్ధులకు ఈ నియమము లేదు. ఈవిధముగా పూర్తిగా నిరాహారముగా ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు వంటి లఘువైన ఆహారమును స్వీకరించవచ్చును. గ్రహణము సంభవించు ఝామునకు ముందు ఝాములో (సుమారు 3 గంటలు) అది కూడా స్వీకరించుట ఉత్తమం కాదు.నీళ్ళు, పక్వముకాని పదార్థములు వీటి శుద్ధి కొరకు వాటిపై దర్భలు వేసియుంచుట అనాదిగా ఉన్న శిష్ట సంప్రదాయం. (కొన్ని ప్రాంతములో ఇంటి గర్భము (ప్రధాన హాలు) లో ముగ్గు వేసి దర్భలనుంచుట ద్వారా ఇంటి మొత్తమునకు శుద్ధి అగునను శిష్టాచారముగా కూడా గలదు). అలా ఉంచిన పదార్థాలను గ్రహణానంతరం వాడుకోవచ్చును. కాని గ్రహణ సమయానికి పూర్వమే వండిన పదార్థములు పనికిరావు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top