EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు : మంత్రి జూపల్లి కృష్ణారావు

ఈతరం భారతం హైద్రాబాద్ మే 19 :

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేశామని బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేస్తానని ఆనాడు కేసీఆర్ చెప్పి రూ.లక్ష కోట్ల ప్రాజెక్టుపై రూ.25 కోట్లే ఖర్చు పెట్టారని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌ కాంగ్రెస్ హయాంలో వచ్చినవేనని గుర్తు చేశారు. కాళేశ్వరం పూర్తి చేసినట్లు పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డికి కావాల్సిన 90 టీఎంసీలు బీఆర్‌ఎస్‌ తేలేకపోయిందని, తాము తెచ్చి తీరుతామని అన్నారు. పాలమూరుపై బీఆర్‌ఎస్‌ది సవతి తల్లి ప్రేమ అని అన్నారు. సమీక్ష అనంతరం ఈ మేరకు మాట్లాడారు.

Related News

Select the Topic
Scroll to Top