హైదరాబాద్ ఆగష్టు 26 (ఈతరం భారతం);హైదరాబాద్ మెహిదీపట్నంలో పెను ప్రమాదం తప్పింది. మెహదీపట్నం బస్టాండ్‌లో ఓ సిటీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. అనంతరం ప్రయాణికులు అందర్నీ కిందకు దించేశాడు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.















