ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 26
శ్రీ సరస్వతి దేవి అనురాగధార ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డా. లక్ష్మీ అన్నదాత ఆధ్వర్యంలో, మాతృమూర్తి కీ. శే. సరస్వతి దేవి జ్ఞాపకార్ధం “మే 10వ తేదీ సాయంత్రం 5:00 గంటలకు” ఘనంగా విశిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డా. లక్ష్మీ అన్నదాత తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాస్ట్లడుతూ “మాతృ సన్మాన మహోత్సవం” పేరిట వివిధ రంగాలలో విజయాలు సాధించి ఈ సమాజానికి తమ వంతు సేవలను అందిస్తున్న వారి తల్లులను (108 మందిని) ఘనంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి వ్యక్తి జీవితంలో తల్లి పాత్ర అపారమైనది. తల్లి ప్రేమ, త్యాగం, మార్గదర్శకత్వం సమాజానికి బలమైన పునాది. ఈ కార్యక్రమం ద్వారా మాతృప్రేమ గొప్పతనాన్ని గౌరవించడం తో పాటుగా, వారి సేవల నీడలో కలిసిపోయిన ఎన్నో త్యాగాలను రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశ్యం తో ఈ వేదికను ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖులు, గౌరవ అతిథులు, సామాజిక నాయకులు హాజరై తల్లుల సేవలను కొనియాడనున్నారు. సన్మాన కార్యక్రమంతో పాటు ప్రేరణాత్మక ప్రసంగాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబఫైటయని ఆమె వివరించారు















