EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మే 10 పివి రావు 75 వజయంతి వేడుకలు

ఈతరం భారతం హైద్రాబాద్ మే 6 :

దేశం లోని ఎస్సి లకు దిక్షుచిగా నిలిచిన మాలమహనాడు వ్యవస్థాపక అధ్యక్షులు పి వి రావు. 75 వ జయంతి వేడుకలు ఈ నెల 10 న ఘనంగా నిర్వహిస్తున్నట్లుమాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ తెలిపారు. తెలుగు రాష్ట్ర ఎస్సి లే కాదు దేశం గర్వించదగ్గ నిజాయతి నీకార్సయినా అణగారిన కులాల ప్రజల సామజిక ఉద్యమ నేత ఎస్సి లకు రాజ్యాధికారం కావాలంటే అన్ని ఎస్సి కులాలు ఐక్యత గా ఉంటేనే సాధ్యం అని చాటి చెప్పిన గొప్ప నేత పివి రావు అని అన్నారు.ఏ అగ్రకుల పార్టీల వద్ద మోకారిళ్ల కుండా బాబాసాహెబ్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లో విద్యార్థి నేత గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం స్థాపన లో సభ్యులు గా తదంతరం అదే సంఘం అధ్యక్షులు గా చేయని తప్పు కు మాల కులాన్ని అగ్రకుల పార్టీ లు మాదిగ సోదరులాచేత తీవ్రంగా అవమానించినప్పుడు మాల మహానాడు అనే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా లో ని ఒక మారుమూల ప్రాంతం నుండి ఒక అణిచివేతకు గురైన ప్రజల పక్షన నిలబడి న పోతుల విగ్నేశ్వర్ రావు (పివి రావు) నిజమైన అంబేద్కర్ వారసుడు అని డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ పేర్కొన్నారు. 1996 నుండి 2005 వరకు ఎలాంటి మచ్చలేని నాయకులు గా ఎదిగిన అయన జన్మించి ఈ నెల 10 తారీకు వరకు 74 యేండ్లు గడిచిన అయన ఎస్సి లు అందులో ప్రధానంగా మాలల కోసం తన ఉద్యోగం, వ్యక్తి గత జీవితం త్యాగం చేసిన మహనీయుడు పి వి రావు. ఒక వైపు ప్రజాస్వామ్య విధానం లో ధర్నాలు రాస్తా రోకో లు, రైలు రోకోలు మరో వైపు అగ్రకుల పార్టీ ల కుట్రలు సాధారణ ప్రజలకు అర్థం అయ్యేలా బహిరంగ సభలు, న్యాయ పోరాటం చేసి ఎస్సి లను ఒక్కటీ చేసిన గొప్ప రాజకీయ సంకల్పం కలిగిన వ్యక్తి పి వి రావు గారి 74వ జయంతి ని ప్రతీ గ్రామం, పట్టణ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించడం మాల ల బాధ్యత అని శ్రీకృష్ణ పిలుపు ఇచ్చారు.

Related News

Select the Topic
Scroll to Top