EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మే 4 నుండి మే 9, వరకు రైతు వారోత్సవం 

ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 24 :

వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అధ్యక్షతన, కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి కార్యాలయంలో ముఖ్య సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించారు.సమావేశంలో ప్రధానంగా వానాకాలం-2026 కోసం వరి విత్తనాల అవసరం మరియు సరఫరా, అలాగే పంటల మార్పిడి పై విశ్లేషణ జరిగింది.వానాకాలం-2026కి సంబంధించి సుమారు 10.80 లక్షల ఎకరాలకు పైగా వరి విత్తనాల ప్రణాళిక రూపొందించబడింది. అందుకు అవసరమైన విత్తనాల సరఫరా, వ్యయం, మరియు ప్రత్యామ్నాయ రకాలను ప్రోత్సహించే అంశాలపై అధికారులు వివరాలు సమర్పించారు.

అలాగే, “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహించబడే రైతు వారోత్సవం కార్యక్రమాలపై కూడా చర్చించారు. ఈ కార్యక్రమం మే 4 నుండి మే 9, వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుంది.ఈ వారోత్సవంలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక అంశాలపై రైతులకు అవగాహన కల్పించబడుతుంది:

* నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం

* ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ విస్తరణ, ప్రత్యామ్నాయ పంటలు

పంట రుణాలు, సహకార సంఘాలు, FPOలు, మార్కెటింగ్ అవకాశాలు

* సౌరశక్తి, యాంత్రీకరణ, డ్రోన్లు

* పశుసంవర్ధక, మత్స్య, నీటి నిర్వహణ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పంటల ఉత్పత్తి ఈ అంశాలు ఉంటాయి

ఈ సమావేశంలో సభ్యులు శ్రీ రాములు నాయక్ (మాజీ ఎమ్మెల్సీ), గడుగు గంగాధర్ , భవాని మరికంటి , సునీల్ , రాంరెడ్డి గోపాల్ రెడ్డి , APC సురేంద్ర మోహన్ , మెంబర్ సెక్రటరీ గోపాల్ , వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగం స్థిరమైన పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చైర్మన్ గారు ,సభ్యులు స్పష్టం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top