EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మైసమ్మగూడ హాస్టల్‌లో కానిస్టేబుల్‌ వీరంగం.. గదుల్లోకి దూరి విద్యార్థులపై లాఠీఛార్జ్

హైదరాబాద్ మార్చ్ 10 ఈతరం భారతం:

హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మైసమ్మగూడలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు మద్యం సేవించి సెక్యూరిటీ గార్డుతో గొడవకు దిగడమే ఈ వివాదానికి దారితీసింది. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే క్రమంలో విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. హాస్టల్ గదుల్లోకి చొరబడి, విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయ‌డ‌మే కాకుండా వారిని రాయ‌లేని విధంగా బూతులు తిట్టాడు.ఇక తమపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థి లోకం భగ్గుమంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే తాము జోక్యం చేసుకున్నామని, విద్యార్థుల ప్రవర్తన వల్లే బలాన్ని ప్రయోగించాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నప్పటికీ, గదుల్లోకి దూరి కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

 

Related News

Select the Topic
Scroll to Top