EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యుద్ధం సాకుతో కొందరు వ్యాపారుల కృత్రిమ కొరత సృష్టి…?

ఈతరం భారతం హైదరాబాద్  ప్రతినిధి మహేషుని లక్ష్మయ్య  మే 3

ఇప్పటి వ్యాపారంలో నిజాయితీ లోపిస్తోంది. సామాన్యుడితోపాటు తాను ఇబ్బంది పడుతున్న కూడా వ్యాపారి ఆపత్ సమయాల్లో అక్రమ సంపాదన పై దృష్టి పెడుతున్నాడు. ఫలితంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు నూనె దగ్గర కూడా మండిపోతుంది. ఈ నూనె ధరల మంటలతో సామాన్యుల బడ్జెట్ తలకిందులై, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందులు తప్పడం లేదు..నెల రోజుల్లోనే కిలో నూనె ధర దాదాపు 22% పెరిగి, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 200లకు చేరుకుంది. ఈ పరిస్థితుల వల్ల వంటింటి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది.పట్టణం పరిధిలో వంట నూనె వంట ఇళ్లలో ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధం మంటలు అంటుకుంటున్నాయి. అక్కడి యుద్ధం ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈ దెబ్బకు వంట నూనెల ధరలు మండి పోతున్నాయి.

యుద్ధం సాకుతో కొందరు వ్యాపారులు కృత్రిమ సృష్టిస్తున్నారు. దీంతో నెల రోజుల్లోనే కిలో నూనె ధర ఏకంగా 22 శాతం పెరిగి సామాన్యులకు షాకిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఓ వైపు రవాణా ఖర్చులు అమాంతం పెరిగిపోగా మరోవైపు గ్యాస్ ధర నిప్పులు కక్కుతున్నాయి. ఇవి చాలవు అన్నట్లు ఇప్పుడు వంట నూనెల ధరలు అదే దారిలో పయణిస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు బతుకీడ్చడం పెను భారంగా మారుతోంది.సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రూ. 180 నుంచి 200 పెరిగింది. పామాయిల్ ధర రూ. 120 నుంచి రూ. 145, వేరుశనగ నూనె రూ. 15 నుంచి 20కి చేరుకుంది. ఇక 5 కిలోల డబ్బా రూ. 1000 నుంచి రూ. 1150 లకు 15 కిలోల టిన్ను(హోల్సేల్) రూ.2300 నుంచి రూ.2400 వరకు పెరిగింది. ఇక రైస్ బ్రౌన్ నూనె ధర లీటర్ రూ. 150 నుంచి రూ. 165కు, వనస్పతి ఆయిల్ లీటర్ రూ. 130 నుంచి రూ. 160కి, సోయాబీన్స్ ఆయిల్ రూ. 150 ລ້໖ . 1703, ລ້ 3 .130 నుంచి రూ. 160 కి చేరుకుంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో ఓ వైపు బయట హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు పెరుగుతుండగా మరోవైపు వంటనూనెల ధరలు ఆకాశానికి అంటుతుండటంతో సామాన్యుల వంటింటి బడ్జెట్లో భారీగా మార్పులు వస్తున్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై తనిఖీలు చేపట్టి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

Related News

Select the Topic
Scroll to Top