ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 25
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ టీఆరెఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిన ‘టీఆర్ఎస్’ అనే అక్షరాలనే తన పార్టీ పేరుగా ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కవిత పెట్టిన కొత్త పార్టీ వల్ల ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లిన తర్వాత, క్షేత్రస్థాయిలో ‘తెలంగాణ’ సెంటిమెంటును కోల్పోయిందనే భావన కొంతమందిలో ఉంది. ఇప్పుడు కవిత మళ్ళీ అదే పాత పేరును స్మరిస్తూ పార్టీ పెట్టడం వల్ల, తెలంగాణ వాదులు, ఉద్యమకారులు అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.















