హైద్రాబాద్ ఫిబ్రవరి 22 ఈతరం భారతం:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్బంధకాండ కొనసాగుతోంది. ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా, అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చెప్పిందే వినాలి, వారి ఇష్టానుసారంగా నడుచుకోవాలనేలా వ్యవహరించడం సిగ్గుచేటని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు.బాన్సువాడ, కామారెడ్డి పర్యటన నేపథ్యంలో నన్ను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం పూర్తిగా అక్రమం, అన్యాయం. శాంతియుతంగా బాన్సువాడ వెళ్లి మా ఎమ్మెల్యేకు సంఘీభావం తెలియజేయాలనుకున్న నన్ను వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం మని దుయ్యబట్టారు.ఆదివారం ఉదయం తార్నాకలోని రామచంద్ర రావు ఇంటిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేసిఖరఖానా పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్బంగాబీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న దమనకాండ, అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ రామచంద్ర రావు మీడియాతో మాట్లాడారు .
బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి, అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధకాండ బయటపడింది.బాన్సువాడలో మా పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నన్నారు.మా ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలను నిరూపించమని ప్రశ్నిస్తే, చర్చకు సిద్ధంగా లేక దాడులకు దిగడం కాంగ్రెస్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శన మని దుయ్యబట్టారు.
ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులను “నిరూపించండి” అని అడిగినందుకే దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య. ఇది చట్టాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే వ్యవహారం.ఈ ఘటనలో తిరిగి బీజేపీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని సుమారు 70 మందిని అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారు. దాడి చేసినవారిని వదిలేసి, బాధితులైన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పక్షపాత వైఖరిని స్పష్టంగా చూపిస్తోందన్నారు
బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే. ఆ తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో పబ్లిక్‌లో కాంగ్రెస్ నాయకులకు చెందినదని చెబుతున్న కారును కాంగ్రెస్ నేతలే ధ్వంసం చేసి, ఆ నేరాన్ని బీజేపీ నేతలపై మోపే ప్రయత్నం చేశారు.
కామారెడ్డికి వెళ్లకుండా నన్ను, ఇతర బీజేపీ రాష్ట్ర నాయకులను ముందస్తు హౌస్ అరెస్టులు చేయడం, గృహ నిర్బంధాలకు పాల్పడడం తీవ్ర అన్యాయం. ఈ అక్రమ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
నిన్న మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ని, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ని దారిలోనే పోలీసులు అరెస్ట్ చేయడం మరో దుర్మార్గ చర్య. ఈ పరిణామాలపై పోలీసు అధికారులతో మేం మాట్లాడాం.బాన్సువాడలో ఉద్రిక్తతల నేపథ్యంలో మా ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపేందుకు మేం వెళ్లాలనుకుంటే అడ్డుకుంటున్నారు. ఇవాళ మా పార్టీ ముఖ్య నాయకులతో కలిసి బాన్సువాడకు వెళ్లాలని మేము స్పష్టంగా నిర్ణయించుకున్నాం. నాతో పాటు పలువురు ముఖ్య నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించి, ముందస్తు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.మేము బాన్సువాడకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మా కార్యకర్తలు మా కోసంఎదురుచూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాన్సువాడకు వెళ్లి తీరుతాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మా ప్రజాస్వామ్య పోరాటం ఆగదని హెచ్చరించారు.















