ఈతరం భారతం హైదరాబాద్ జులై 30 తెలంగాణ :రాష్ట్రమంతా ఒక యూనిట్‌గా కొత్త డిస్కమ్ ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు CM రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ, గృహ, స్కూళ్లు, కాలేజీలకు అందించే ఉచిత విద్యుత్‌ను ఈ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. దీంతో పనితీరు మెరుగై, జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందన్నారు. అటు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం దిశానిర్దేశం చేశారు.















