EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాష్ట్రంలో నూతన వసతి గృహాలతో పాటు అనుబంధ వసతి గృహాలను ఏర్పాటు చేయాలి   తెలంగాణ రాష్ట్ర ఈ బి సి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట్రా ప్రభాకర్ రెడ్డి.

హైదరాబాద్ జూలై 14 (ఈతరం భారతం);తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల డిమాండ్ లకు అనుగుణంగా నూతన కళాశాల వసతి గృహాలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఈ బి సి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట్రా ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే నూతన వసతి గృహాలతో పాటు అనుబంధ వసతి గృహాలను ఏర్పాటు చేయాలి అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఇప్పటికే ఉన్న కళాశాల వసతి గృహాలకు అదనంగా సీట్లను మంజూరు చేస్తూనే అనుబంధ వసతి గృహాలకు అనుమతులు ఇస్తూ, నూతన వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరుతు పలుమార్లు బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు తెలంగాణ రాష్ట్ర ఈ బీసీ సంఘం తరపున వినతి పత్రాలను సైతం ఇచ్చినప్పటికీ నేటి వరకు స్పందించక పోవడం శోచనీయమన్నారు.. ఉన్నత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లకుండా సమస్యను పరిష్కరించకుండా. పేద, బడుగు బలహీన, వర్గ విద్యార్థులలో ప్రభుత్వం పట్ల చెడ్డ పేరు తెస్తున్నారన్న ఆయన ఆరోపించారు.విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించి రాష్ట్రంలో నూతనంగా బీసీ కళాశాల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే ఫ్రీ మెట్రిక్ హై స్కూల్ వసతి గృహాలలో విద్యార్థులు లేక మూతపడ్డాయి ఆ వసతి గృహాలను కళాశాల వసతి గృహాలుగా అనుమతులు ఇవ్వాలని ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.పేద బడుగు బలహీనవర్గ విద్యార్థులు ఇప్పటికే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వసతి గృహాలలో అవకాశం లేక రైల్వేస్టేషన్లో, బస్టాప్లను, బస్టాండ్లను, పునరావస, కేంద్రాలుగా చేసుకుంతున్నరన్నారు. .2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి 45 రోజులు గడిచిన విద్యార్థికి వసతులు లేక కళాశాలకు వెళ్లలేక తిరిగి సొంత ఊరికి వెళ్ళిపోతున్నారాణి, పేద వర్గాల వారికి ఉన్నత విద్య అందని ద్రాక్షలా మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో అడ్వకేట్ సతీష్, అడ్వకేట్ హరికృష్ణ, కోశాధికారి రాజు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top