EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ప్రవేశపెట్టి అమలు చేయాలి:  బిజెపి తెలంగాణా లీగల్ సెల్ డిమాండ్ 

హైదరాబాద్ అక్టోబర్ 4 (ఈతరం భారతం );న్యాయవాదులపై జరుగుతున్న హత్యలు, దాడులు, ఇతర భద్రతా సమస్యల పరిష్కారంగా ప్రత్యేక న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని బిజెపి లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ గోకుల్ రామారావు తెలిపారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో బార్ కౌన్సిల్ వాయిస్ చైర్మన్ కుంచ సునీల్ గౌడ్ ,తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్, సుంకరి జర్ధన్ గౌడ్, బిజెపి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్,గులారి మల్లేశం గౌడ్ లతో కలిసి మాట్లాడారు.మన దేశంలో దాదాపు 30 లక్షల మంది న్యాయవాదులు ఉన్నారు. వాళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, న్యాయవాదులకూ వారి కుటుంబ సభ్యులకూ ప్రోత్సాహకరమైన ఇన్సూరెన్స్ ప్రణాళిక ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో న్యాయవాదుల కుటుంబాలకు బేనిఫిట్ జరుగనుందని తెలిపారు.ఇప్పటికే లా కమిషన్ రిపోర్ట్ పంపబడింది, రిపోర్ట్ అందగానే చట్టం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త చట్టం ద్వారా న్యాయవాదుల భద్రత బలోపేతం అవుతుంది. ఇది శుభసూచకమన్నారు. గత 75 సంవత్సరాలలో జరగని విధంగా న్యాయవాదుల డిమాండ్స్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున స్టేట్ బార్ కౌన్సిల్స్ ద్వారా ప్రతిపాదనలను, దేశవ్యాప్తంగా న్యాయవాదులకు సంబంధించిన సమస్యలను స్పష్టంగా వెల్లడించారన్నారు.బీమా / మెడికల్ ఇన్సూరెన్స్ త్వరలో అందరికీ లభిస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారని ఇది హర్షణీయమన్నారు.దేశంలో న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను అరికట్టడానికి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అవసరమని రిప్రజెంటేషన్ ఇచ్చామని తెలిపారు.. దీనికి కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లా కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చట్టం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారన్నారు.ఈ సమావేశం ద్వారా కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల భద్రత, ఆర్థిక సాయం, ప్రొటెక్షన్ చట్టం అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందడుగు వేసింది. ఇది న్యాయవాదులకు ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.అలాగే జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ పై కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామని తెలిపారు.కాన్స్టిట్యూషన్ సెవెంత్ షెడ్యూల్‌లో ఉన్న చట్టాలు స్టేట్ గవర్నమెంట్ ద్వారా తీసుకురావచ్చు. అయితే, ఆ అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటివరకు చట్టరూపం ఇవ్వలేదన్నారు.

స్టేట్ గవర్నమెంట్ తక్షణమే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ప్రవేశపెట్టి అమలు చేయాలని బార్ కౌన్సిల్ మరియు బిజెపి తరఫున డిమాండ్ చేసారు.లా కమిషన్ రిపోర్ట్ అందగానే, కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల కోసం ఆరోగ్య భద్రత, బీమా, డెత్ బెనిఫిట్‌లతో కూడిన ఇన్సూరెన్స్ స్కీమును రూపొందించి, వెంటనే అమలుకు యోచిస్తోంది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఈ విషయాన్ని చెప్పారు.ఈ స్కీమ్ ద్వారా న్యాయవాదుల కుటుంబ సభ్యులు కూడా మేలు జరుగుతుందన్నారు.ప్రస్తుతం, 50,000 అడ్వకేట్లలో కేవలం సగానికి మాత్రమే స్టేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఇన్సూరెన్స్ ద్వారా అందుతోంది. మిగతా వారి రీన్యూవల్ లేదా కొత్తగా కవర్ చేయడం జరగడంలేదన్నారు.కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 100 కోట్లు విడుదల చేసి, న్యాయవాదులకు సమానంగా ఇన్సూరెన్స్ అందించాలి.

హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్‌లోని స్టాండింగ్ కౌన్సిల్స్ తక్షణమే అపాయింట్ చేస్తామని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హామీ ఇచ్చారని తెలిపారు.ప్రస్తుతం న్యాయవాదుల ఫీజులు తక్కువగా ఉండటం వల్ల సమస్యలు ఉన్నాయి. కొత్త ఫీ స్ట్రక్చర్‌ను పెంచి, న్యాయవాదులకు సరైన రివార్డింగ్ కల్పిస్తామని మంత్రి స్పష్టంగా తెలిపారన్నారు.డెపార్ట్‌మెంట్ రికవరీ ట్రిబ్యునల్ అప్లికేషన్ తో కొత్తగా ఏర్పాటు అయిన డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్‌కు అప్పిలేట్ ట్రిబ్యునల్ కోల్‌కత్తా కాకుండా, హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారని తెలిపారు.ప్రస్తుత సౌకర్యాలు తక్కువగా ఉండి పార్కింగ్ ససమస్యలు ఉన్నందున సెంట్రల్ గవర్నమెంట్ భవనాల్లో కవాడిగూడకు షిఫ్ట్ చేస్తారని అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారని తెలిపారు.కంపెనీ అపిలేట్ ట్రిబ్యునల్ చెన్నైలో ఉండటం వల్ల ఇబ్బందులు ఉంటున్నాయి. భవిష్యత్తులో దీనిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, న్యాయవాదులు చెన్నైకి వెళ్లకుండా అన్ని కేసులు నిర్వహించగలుగుతారని హామీ ఇచ్చారన్నారు.ఈ హామీలు త్వరగా అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలిపినట్లు ఆయన తెలిపారు. న్యాయవాదులు మరియు వారి కుటుంబ సభ్యులు, అన్ని సౌకర్యాలు, భద్రత మరియు ప్రోత్సాహాలు పొండాలని కోరారు.బీజేపీ లీగల్ సెల్ తరఫున ఈ హామీలను అందరికీ తెలియజేస్తున్నాం, న్యాయవాదుల పట్ల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలకు న్యాయవాదుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top