ఈ తరం భారతం హైదరాబాద్:మే 31
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర అవతరణ దినోత్సవ నేపథ్యంలో 99 రోజుల తెలంగాణ ప్రజాకళ లో భాగంగా ఆదివారం సాయంత్రం రవీంద్ర భారతిలో నిర్వహించిన మహిళా వారోత్సవ కవి సమ్మేళనంలో కరీంనగర్ కు చెందిన ప్రముఖ కవయిత్రి పత్తెo వసంత ఆదివారం సాయంత్రం పాల్గొన్నారు. ఆకాశమే అవధిగా అన్న కవితను ఆమె ఈ రాష్ట స్థాయి కవి సమ్మేళనంలో చదివి వినిపించి ప్రశంసలందుకున్నారు. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్త, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి చేతుల మీదుగా ఆమె ప్రభుత్వ సత్కారాన్ని అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కవి సమ్మేళనంలో పాల్గొని సత్కారం పొందినందుకు పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.














