హైదరాబాద్ జూలై 19 (ఈతరం భారతం)రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు కోలిజియం నియామకంతో త్రిపుర ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో శనివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో రాజ్భవన్లో 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. సిఎంతో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, డిజిపి జితేందర్,హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు హజరయ్యారు
.















