EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చయ్యే పరీక్ష ఆరోగ్యశ్రీ కింద పేదలకు ఉచితం

ఈతరం భారతం హైద్రాబాద్ మే 29 :

హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అత్యాధునిక వైద్య సేవల విస్తరణ వేగం అందుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దిల్లీ ఎయిమ్స్ స్థాయిలో నిమ్స్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటోంది. సేవల ఆధునికీకరణతోపాటు పరిశోధనలకు పెద్దపేట వేయనున్నారు. రేవంత్రెడ్డి సూచనలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తరచూ అధికారులతో సమీక్షిస్తూ నిమ్స్కు ఆధునిక వసతులు కల్పించే దిశగా కృషి చేస్తున్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వ బడ్జెట్, సీఎస్ఆర్ తదితర వనరుల ద్వారా సమకూరిన నిధుల్లో రూ.150 కోట్లకు పైగా వెచ్చించి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

ఆధునిక క్యాన్సర్ చికిత్సలకు నిమ్స్ శ్రీకారం

తాజాగా నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్నాళ్ల క్రితమే చేపట్టిన ప్రయోగాత్మక పరీక్షలు ఇప్పుడు విజయవంతమవడంతో శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. మొదటి విడతలో వందల మంది రోగుల శాంపిళ్లను ఎన్జీఎస్ మిషన్పై విజయవంతంగా పరీక్షించారు. వారందరికీ ఆధునిక క్యాన్సర్ చికిత్సలు అందించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ అత్యాధునిక జన్యుపరీక్షను ప్రారంభించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చయ్యే ఈ పరీక్షను ఆరోగ్యశ్రీ కింద పేదలకు ఉచితంగా చేయనున్నారు.

అందరికీ ఒకే ఔషధం కాదు

ఇంత వరకు ఒకే రకం క్యాన్సర్ సోకిన వారికి ఒకేరకం మెడిసన్ ఉండేది. కానీ అది కొంత మందికి పని చేయకపోవడంతో ఆ వ్యాధి మరింత ఎక్కువ అవుతుంది. దీనికి కారణం రోగుల్లో జన్యులోపం వేర్వేరుగా ఉండటమే. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులకు ఊపరితిత్తుల క్యాన్సర్ వస్తే వారిలో ఒకరికి ఈజీఎఫ్ఆర్ జన్యువు మారితే, మరోకరిలో ఏఎల్కే జన్యువు ఉండే అవకాశం ఉంది. ఈ తేడాను ఎన్జీఎస్ పరీక్షతో తెలుసుకోవచ్చు. క్యాన్సర్తో ఏ జన్యువు పాడైంది. ఏ జన్యువు ఎక్కువ మ్యుటేషన్కు గురై క్యాన్సర్కు కారణమైందో కచ్చితంగా గుర్తించవచ్చు. ఈ ఔషధంతో ఆ జన్యువుపైనే నేరుగా దాడి చేసే టార్గెటెడ్ థెరపీ, పర్సనలైజ్డ్ మందులను వైద్యులు సిఫార్సు చేయొచ్చు. ముఖ్యంగా స్టేజ్-4 ఊపిరితిత్తులు, పెద్దపేగు, అండాశయ క్యాన్సర్లు, రొమ్ము, కీమోథెరపీ విఫలమైన వారికి ఎక్కువ ఉపయోగం ఉంటుందని డాక్టర్లు పేర్కొన్నారు.

నిమ్స్లో ఉచిత వైద్య పరీక్షలు

అన్ని ఆశలు వదులుకునే నాలుగో దశ క్యాన్సర్లలో ఉన్న ప్రస్తుతం ఇమ్యునోథెరపీ పెద్దది. శరీరంలోని వ్యాధి నిరోధక టి-కణాలు ప్రేరేపించి క్యాన్సర్ను నియంత్రించేందుకు ఈ మందులు పనిచేస్తాయి. రూ.లక్షల విలువైన మందులు పనిచేస్తాయో లేదో తెలుసుకోకుండా గుడ్డిగా సిఫార్సు చేస్తే పెషేంట్కి నష్టం కలగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్జీఎస్ పరీక్ష కీలకం. క్యాన్సర్ కాదు నివ్యాధికి చికిత్సేర్ధారణ పరీక్షలు సైతం అత్యంత ఖరీదైనవే. చికిత్సలో భాగంగా ఇచ్చే రకరకాల మందులు శరీరాన్ని పాడుచేస్తోంది. గతంలో మ్యుటేషన్లకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నారు. అయితే మ్యూటేషన్ల నిర్ధారణ చేసే పరీక్షలు ఖరీదు వేల రూపాయలు ఉంటుంది. అలాంటిది ఇటీవల ఖరీదైన వైద్య పరీక్షలను తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా నిమ్స్ అందిస్తోంది.

Related News

Select the Topic
Scroll to Top