ఈతరం భారతం హైదరాబాద్ జూలై 27 :తెలంగాణ : రాష్ట్రంలో MPTC, ZPTC, గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. కాగా గత స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. ఈసారి రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నట్లు ఈసికి ఆ శాఖ తెలిపింది. దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని సీఈవోలు, డీపీవోలకు ఆదేశాలిచ్చింది. ఎన్నికల నిర్వహణకు ప్రణాళికను రూపొందించాలని సూచించింది.















