ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 22
రేపటి కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ.రేపు మహా ధర్నాలు చేపట్టాలని నిర్ణయం.అన్ని డిపోల ఎదుట రేపు ఉ.5గంటల నుంచి మహా ధర్నాలకు పిలుపు.మొదటి రోజు సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపిన నాయకత్వం.ప్రభుత్వం, యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం.సమస్యలు పరిష్కరించలేమని కమిటీ చేతులెత్తేసిందన్న జేఏసీ.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్.30 శాతం తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్.హైదరాబాద్‌లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలన్న జేఏసీ.ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి.కార్మిక సంఘాలను పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.సమస్యలు తీరే వరకు వెనకడుగు వేయబోమని ఆర్టీసీ జేఏసీ హెచ్చరిక.















