ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 26
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం..రేపే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన..తెలంగాణ ప్రజా జాగృతి’గా నామకరణం.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. పార్టీ జెండా, ఎజెండా కూడా ఖరారు.ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు పార్టీని ప్రకటించనున్న దేవనపల్లి కవిత.తన మెట్టినిల్లు నుంచే పార్టీ ప్రారంభం చేసే అవకాశం.పార్టీ సింబల్, విధివిధానాలు వెల్లడించనున్నట్లు సమాచారం.తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించే అవకాశం..తెలంగాణ రాజకీయాల్లో ఈ కొత్త పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.















