EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రేవంత్ మంచి యాక్టర్ ..నోబుల్ ప్రైజ్ కాదు గ్లోబల్ ఇవ్వాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు

హైదరాబాద్ జూలై 25 (ఈతరం భారతం); రేవంత్ మంచి యాక్టర్ ..నోబుల్ ప్రైజ్ కాదు గ్లోబల్ ఇవ్వాలి,ఆస్కార్ కాదు అత్తారింటికి దారేది మూవీలో ఉన్న భాస్కర్ అవార్డు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు ఎద్దేవా చేసారు.శుక్రవారం పార్టీ కార్యాలయం లో మీడియాతో చేత చాట్లో మాట్లాడుతూ మోడీ కులాన్ని బీసీ లో కలిపాకే ఆయన సిఎం అయ్యారు మోడీ నీ కన్వర్షన్ బీసీ అనడం వెనకబడిన కులాలను అవమానపరచడమే నని విమర్శించారు. రాహుల్ గాంధీ కులం ఏంటి?రాహుల్ గాంధీ తాత ఒక పర్షియన్ రాహుల్ బ్రాహ్మిణ్ అని చెప్పుకుంటున్నారు రాహుల్ గాంధీ కి గాయత్రి మంత్రం వచ్చా? రాహుల్ గాంధీ బ్రాహ్మణ వర్గం ఎలా అవుతారని ప్రశ్నించారు.పార్టీ పోస్టుల కొరకు నా దగ్గరికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్న ప్రజల వద్దకు వెళ్ళండి సమస్యలపై పోరాటం చేయండి అప్పుడే లీడర్ అవుతారు తప్ప పోస్ట్ వచ్చిన వారంతా లీడర్లు కాదుఐదేళ్లుగా నాకు ఏ పోస్ట్ లేదు నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తేవడమే లక్ష్యం…రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తాను ఆ నెక్స్ట్ ఖమ్మం జిల్లా పర్యటన ఉంటుంది గ్రౌండ్ లో పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా, నడ్డా చెప్పారు.దత్తాత్రేయ పై రేవంత్ కు ప్రేమ ఉండటం పై రేవంత్ కు థ్యాంక్ యూ మేము కూడా బీసీ నీ సిఎం చేయమని డిమాండ్ చేస్తున్నాం బీసీ కమిషన్ పెట్టిందే బీజేపీ మీరు తెచ్చిన బిల్లు మా మీద పెడతాయి అంటే ఎలా?అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఎందుకు పెట్టలేదు ? ఆర్డినెన్సు తేవాల్సిన అవసరం ఏముంది? కుల గణన రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు ? మిగతా కులాల లెక్క ఎందుకు ఇవ్వడం లేదు ఫోన్ ట్యాపింగ్ లో కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ షాడో బాక్సింగ్ చేస్తున్నాయిబీజేపీ కి మీడియా లో స్పేస్ దొరకకుండా రెండు పార్టీ లు నాటకాలు ఆడుతున్నాయిఫోన్ ట్యాపింగ్ లో అధికారులను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారుఒక్క లీడర్ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదుఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి తెచ్చారు? రేవంత్ కు రోజు రోజుకి బి ఆర్ ఎస్ పార్టీ తో కెమికల్ బంధం బలపడుతుంది అందుకే రేవంత్ తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్తున్నారుప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే మేము మా పార్టీ తరపున 42శాతం బీసీ లకు సీట్లు ఇస్తా మన్నారు.

Related News

Select the Topic
Scroll to Top