ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 3:
________________________________
రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు వాడని కార్డులు బంద్
కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు షాకిచ్చే యోచనలో ఉంది. ఆరు నెలలుగాఝ వరుసగా రేషన్ తీసుకోనివారి కార్డులను తాత్కాలికంగా నిలిపివేయనుంది. అక్టోబర్ నుండి దాదాపు 1.58 కోట్ల కార్డులను నిలిపివేసే అవకాశం ఉంది. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటే కార్డులు మళ్లీ యాక్టివేట్ అవుతాయి. మరణించిన, డూప్లికేట్, నకిలీ పేర్లతో ఉన్న కార్డులను గుర్తించి తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. మేరా రేషన్ యాప్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు















