ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 3
________________________________
తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేకున్నా హైదరాబాద్ భవానీనగర్ ఎస్‌ఐ, సీఐ తన చేతులు కాళ్లు కట్టేసి, కళ్లల్లో కారం చల్లి కొట్టారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తలాబ్ కట్టకు చెందిన షానవాజ్ ఆలం అనే వ్యక్తిఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీ సజ్జనార్‌ను ఆదేశించిన న్యాయమూర్తి. కోర్టు ఆదేశాలు ఇచ్చినా సజ్జనార్ ఎలాంటి విచారణ జరపలేదని బాధితుడు దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్ విచారిస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు.















