EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 23

మార్కెట్‌లో కనీస ధర లేక ఉల్లి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ మార్కెట్‌కు పంటను తరలిస్తే క్వింటాల్‌కు రూ.150 నుంచి రూ.300 మాత్రమే పలుకుతోందని లబోదిబోమంటున్నారు. అక్కడకు తరలిస్తే కనీసం రవాణా చార్జీలు కూడా రావడం లేదంటున్నారు. దీంతో చేసేదేమీ లేక వికారాబాద్‌ జిల్లాలోని ఉల్లి రైతులు సమీపంలోని సంతల్లో కిలో రూ.3,నుంచి రూ.4 చొప్పున విక్రయిస్తున్నారు. మర్పల్లి సంతలో ఉల్లి రైతులు 50 కిలోల బస్తా రూ.200కు విక్రయిస్తూ కంటతడి పెడుతున్నారు. మండల కేంద్రంలో సంత కావడంతో పంచలింగాల, పట్లూర్‌, కంచర్‌పల్లి, మొగిలిగుండ్ల తదితర గ్రామాలకు చెందిన రైతులు ట్రాక్టర్‌లలో ఉల్లి బస్తాలు తీసుకొచ్చి 50-60 కిలోల బస్తా రూ.200కే విక్రయించారు. మార్కెట్‌లో ఉల్లి పంటకు ధర లేదని, ఓ వైపు అకాల వర్షాలతో తీరని నష్టం జరుగుతుందని చేసేదేమి లేక కనీసం కూలీ డబ్బులైనా వస్తాయని విక్రయిస్తున్నట్లు రైతులు వాపోయారు.

Related News

Select the Topic
Scroll to Top