EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

లాయర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది : మంత్రి వివేక్ వెంకట్ స్వామి

ఇతను భారతం హైద్రాబాద్ అక్టోబర్ 24:

________________________________

లాయర్ల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిమంత్రి వివేక్ వెంకట్ స్వామి అన్నారు. ఇందిరా భవన్ లో టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అధ్యక్షతన టీసీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో పాల్గొని ప్రసంగించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, లాయర్ల పోస్టుల భర్తీ మరియు వారికి తగిన ప్రాధాన్యత కల్పించే విషయంలో కేబినెట్లో చర్చించి, నిజంగా పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన పోస్టులు దక్కేలా చూస్తా మన్నారు.ప్రస్తుత రోజుల్లో చాలా ఇష్యూస్ కోర్టుకు వెళ్తున్నాయని, చాలా నిర్ణయాలు కోర్టు తీర్పుల ద్వారానే వస్తున్నందున లాయర్ల ఫెటర్నిటీ చాలా కీలకమైనదన్నారు.

లీగల్ సెల్ చైర్మన్ ఆధ్వర్యంలో 31 జిల్లాల్లో 31 లాయర్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే దీనివల్ల ప్రతి జిల్లా కేంద్రంలోనూ కొంతమంది అడ్వకేట్లకు పోస్టులు లభించే అవకాశం ఉంది  కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లాయర్లందరూ గట్టిగా పోరాడి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి చక్కని ప్రయత్నాలు చేశారు .మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు మరియు ఇతర పెద్దలు అందరితో చర్చించి, లాయర్లకు అనుకూలంగా ఉండే అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచేలా మంచి ఆలోచనతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు

Related News

Select the Topic
Scroll to Top