EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వంజరులను డీ.ఎన్.టీ లుగా గుర్తించాలి

ఈతరం భారతం హైద్రాబాద్ మే10

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంచార కులాలను డిమాటిక్ నోటిఫైడ్ ట్రైబ్స్ ( డి ఎన్ టి ) లుగా గుర్తించడం హర్షనీయమని కానీ నిజమైన సంచార జాతి వంజరి కులాన్ని డిఎన్టిగా గుర్తించుకోవడం బాధాకరమని తెలంగాణ వంజరి సంఘం అభిప్రాయపడింది.

సికింద్రాబాద్ లో జరిగిన వంజరి సంఘం ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ,  అడవుల నుంచి ఉత్పత్తులను మైదాన ప్రాంతంలో అమ్మే వనచరులు అనగా అడవుల్లో సంచరించేవారు తద్వారా వంజరులుగా పిలవబడుతున్న తమ కులస్తులు నిజమైన సంచార జాతి అని ప్రభుత్వానికి ఈ విషయాన్ని ఎన్నిసార్లు వివరించిన అధికారులు ఆదేశంగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో సంచార గిరిజనులుగా గుర్తింపబడ్డారు తమ జాతి గిరిజన హోదా అనుభవిస్తుంటే ఇక్కడ 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒక జీ. ఓ ద్వారా ఎస్టీలుగా ఉన్న తమకులాన్ని బి సి( డి) లోకి మార్చారని ఇది అన్యాయం అని ఎన్నిసార్లు గొంతు చించుకొని అరిచిన ప్రయోజనం లేదని, తమ గురించి మాట్లాడే పార్టీలు గాని ప్రతినిధులు లేకపోవడం బాధాకరమని వారు అన్నారు. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షలు గా ఉన్న తమ జనాభాను మొన్న కులగణన లో తక్కువ చేసి చూపించారని వారు వాపోయారు.తమ ఎస్టీ తమకు తిరిగి పునరుద్ధరించాలని లేనిచో డిఎన్టి ఇల్లుగా గుర్తించి వెనుక పడ్డ కులస్తులను సామాజికంగా ఆర్థికంగా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కాలేరు విశ్వనాథం సాల్వ్వేరు కృష్ణ ఎదగని హరినాథ్, దాత్రిక కాశీనాథ్, ముజకరి రవీందర్ అముద లక్ష్మణ్ కాలేరు సురేష్ ముజకరి దినేష్ కాలేరు సాయిబాబా మల్లక్ ఆనంద్, కాలేరు శ్రీనివాస్, మురళి కృష్ణ కేంద్రీ తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top