EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విద్యార్థినులకు ఉద్యోగ సాధన పై అవగాహన 

హైదరాబాద్ మార్చ్  29 (ఈతరం భారతం ప్రతినిధి ): బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రంలో చదువు కొనసాగిస్తూనే శిక్షణతో కూడిన ఉద్యోగ సాధనకు సంబంధించిన అవగాహన కార్యక్రమం ఆదివారం జరిగింది. టిసిఎస్ఐఓఎన్ భాగస్వామ్యంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, వీ హబ్ తో వ్యాపారస్తులుగా స్టార్ అప్ ఐడియా, రిటైలర్స్, నిపుణ ఫెలోషిప్ పథకం, ఇండస్ట్రీ స్కిల్స్, సమత ఫ్రీషిప్స్ పేరిట ఆదివాసి యువత, ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులు తదితరులకు శిక్షణకు సంబంధించిన అంశాలపై ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు సంపూర్ణ అవగాహన కల్పించారు.

అంబేద్కర్ యూనివర్సిటీ కి చెందిన కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం డీన్ ప్రొఫెసర్ ఆనంద్ పవార్ , ఎడ్యుకేషన్ విభాగం డీన్ ప్రొఫెసర్ చంద్రకళ, జియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ ఎస్ రజిత, బేగంపేట అధ్యయన కేంద్రానికి చెందిన అశోక్ బాబు, పూర్ణిమ, కౌన్సిలర్లు డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ పి వీరయ్య, సీతాదేవి, ఉమాకాంత్, ఇసాక్, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top