EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిభావంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయి

ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 23:

_________________________________

గోశామహల్ నియోజకవర్గం లోని ఉస్మాన్ గంజ్, కొత్త ఉస్మాన్‌గంజ్‌లలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మజీ ఎంపీ ఎం.అంజనకుమార్ యాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.

ఈ సందర్భంగా అంజనకుమార్ యాదవ్ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిభావంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలోఆకాష్ సింగ్ వికాశాల్ చిందాలియా శ్రీనివాసరెడ్డి ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎస్. ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top