EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వృద్ధ మహిళా అంత్యక్రియలకు వెస్సో సహాయం

హైద్రాబాద్ జులై 20.(ఈతరం భారతం)హైదరాబాద్ మీర్పేట్ లో ఒక చిన్న కుటీరం లో అద్దెకు నివాసం ఉంటున్న మడుపోజు నరసింహ చారి వడ్రంగి వృత్తితో జీవనం కొనసాగిస్తున్నారు. తన చాలీచాలని ఆదాయంతో తల్లి, భార్య, కూతుర్లను పోషిస్తున్నారు. తల్లి మంగమ్మ(69) ఇటీవల అస్వస్థతకు గురై ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యం పొందుతూ, శివైక్యం చెందారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నరసింహ చారి తల్లి అంత్యక్రియలను పూర్తి చేయడానికి వెస్సో సహాయం కోరారు. వెస్సో గౌరవ దాత సహకారంతో నరసింహ చారి కి పదివేల రూపాయలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి స్థానిక సంఘ నాయకులు దంతోజు ప్రభాకరాచారి, వొలవోజు ప్రసాద్ చారి, అందోజు జగదీశ్ చారి సహకరించారు. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ అంత్యక్రియల వంటి పుణ్య కార్యానికి ఉదారంగా విరాళం ఇస్తూ నిరుపేద కుటుంబాలకు సహకరిస్తున్న గౌరవ దాత శ్రీమతి తాళాబత్తుల శ్రీలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.

Related News

Select the Topic
Scroll to Top