హైదరాబాద్ ,ఆగస్టు 12 (ఈతరం భారతం);: తిరుపతి వెంకన్న లడ్డు రుచికరమైన తీపి పదార్థమే కాదు ఆధ్యాత్మిక శక్తి నిగూఢమైన దైవ పదార్థంగా భావించవచ్చు. ప్రతిరోజు మూడున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తారు . ముడి సరుకుల సేకరణ దగ్గర నుంచి తయారీ వరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అత్యంత నాణ్యత, రుచిగా ఉండే లడ్డు ప్రసాదాన్ని పన్నెండు గంటల ఉపవాసం తర్వాత తిని బ్లడ్ షుగర్ పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయని తెలిసింది. డ్రైఫ్రూట్స్, బెషన్, ఆవు నెయ్యి వాడకం కారణంగా ఆరోగ్య ప్రదాయినే అని తేలిందట. పురాతన దేవాలయాల వద్ద ప్రసాదాలు అందుకే మహిమాన్వితంగా ఉంటాయని భక్తులు చెబుతుంటారు. 322 సంవత్సరాల క్రితం 1715 ఆగష్టు రెండవ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామికి నైవేద్యంగా లడ్డూ ప్రసాదాన్ని ప్రవేశపెట్టారు.2009 లో ఈ లడ్డూకు పేటెంట్ హక్కులు కూడా సంక్రమించాయి.















