EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వైన్స్ టెండర్లలో అరెకటికలకు ప్రభుత్వం 30శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి

హైదరాబాద్ ఆగష్టు 23 (ఈతరం భారతం);”మటన్ వృత్తి- సారా వృత్తి జన్మత: ఐన అరెకటికలకు ప్రభుత్వం వైన్స్ టెండర్లలో 30శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని అరెకటిక అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం సచివాలయం లో సంఘం ప్రతినిధులు రాష్ట్ర ఎక్ష్సిజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం అరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అద్యక్షులు భూంపల్లి అశోక్ దాదా, ఉపాధ్యక్షులు జి రమేష్, కె.వెంకటేశ్వర్ , ఎం నాగ శేషు జాయింట్ సెక్రెటరీ జె.శ్రీనివాస్, ట్రెజరర్ కేడి దినేష్, కేడి గోపాల్ జి, మొదలగు వారితో కలిసి మాట్లాడారు. మాదే అయినా మాకు గత ప్రభుత్వం 2021 సం.లో నూతన ఎక్సైజ్ పాలసీలో సైతం అన్యాయం చేసింది. అప్పటి ఎక్సైజ్శాఖామంత్రి గౌజ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% ఏ మాత్రం సంబంధంలేని వీరికి కట్టబెట్టిండు. మాకు న్యాయం చేయండని అనేక ఉద్యమాలు చేసినా, మెమోరాండాలు ఇచ్చినా మా అరె కటికలకు న్యాయం జరుగలేదు. ఏ ఒక్కటి ఇవ్వలేదు.మా సుటన్ వృత్తిపై 9 మేకల మండీలపై ప్రతియేటా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. యాభైకి పైగా ఉన్న అంగళ్ళపై కోట్లాది రూ.ల ఆదాయం వస్తుంది. ప్రభుత్వ ఖజానాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మా కులవృత్తి ఆర్ధిక వనరులుగా ఉపయోగపడుతుంది. అయినా ఈ 79 సం.రాల కాలంలో మా కులానికి ప్రత్యేక కార్పోరేషన్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. మమ్మల్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.మా అరెకటికలకు ప్రభుత్వం వెంటనే రూ.500 కోట్లతో ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని,.(3) ప్రభుత్వం బిసి-డి నుండి బిసి ఎ హోదా కల్పిస్తూ జి.ఓ. తేవాలని,.(4) ప్రభుత్వం రాష్ట్రంలోని మేకల మండిలను ఆధునికరించి అరెకటికలకు అప్పగించాలని,.(5) ఇంటిగ్రేటెడ్ మటన్ మార్కెట్లలో అరెకటికలకు పూర్తి హక్కు కల్పిస్తూ జీవో తేవాలని,.(6) మేకలు తేవడానికిపోయి వస్తున్న ఆరె కటికలకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రూ.25 లక్షలు వర్తింపచేస్తూ ప్రత్యేక జిఓ తీసుకురావాలని డిమాండ్ చేసారు.

.

 

Related News

Select the Topic
Scroll to Top