ఈతరం భారతం హైదరాబాద్, ఏప్రిల్ 27 :
వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ పరికరాల రంగంలో అగ్రగామిగా ఉన్న ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్ తన పవర్‌ట్రాక్ బ్రాండ్ కింద సరికొత్త డిజిట్రాక్ సిరీస్ ట్రాక్టర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ఎస్కార్ట్స్ కుబోటా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ నందా సోమవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అకిరా కాటో, ట్రాక్టర్ బిజినెస్ డివిజన్ చీఫ్ ఆఫీసర్ నీరజ్ మెహ్రా తోకలసి ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగానే ఎస్కోర్ట్స్ కుబోటా డిజిట్రాక్‌ను పూర్తి సిరీస్‌గా విస్తరించి మూడు కొత్త ట్రాక్టర్ మోడళ్లను విడుదల చేసిననట్లు తెలిపారు. ఈ ఆవిష్కరణతో కంపెనీ తన పాత డిజిట్రాక్ శ్రేణిని కేవలం 2 మోడళ్ల నుండి 5 మోడళ్ల సమగ్ర సిరీస్‌గా విస్తరించిందని పేర్కొన్నారు. ఈ కొత్త ట్రాక్టర్లు 45 నుండి 55 హెచ్.పీ విభాగంలో 4 వీల్ డ్రైవ్ మోడల్‌తో సహా అందుబాటులో ఉంటుందని తెలిపారు.















