ఈతరం భారతం హైద్రాబాద్ మే 19 :
సమాజానికి ఎంతో ప్రయోజన కారి అయిన శారీరక సాక్షరత ప్రాధాన్యత గురించి క్రీడా సమాజమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కు తెలియాలని పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ అన్నారు.
“ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగాతెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో యువత సాధికారత, ఫిట్‌నెస్ ప్రోత్సాహానికి అంకితమైన “యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్–2026” కార్యక్రమాలను ఈ నెల 18 నుండి 23 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల సందర్భంగాఈరోజు మే 19, 2026న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో
పుల్లెల గోపీచంద్ “ఫిజికల్ లిటరసీ” అంశంపై ప్రత్యేక ఉపన్యాసం అందించారు.యువతలో ఆరోగ్యకర జీవనశైలి, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడంలో ఫిజికల్ లిటరసీ ప్రాముఖ్యతపై గోపీచంద్ తన అనుభవాలను పంచుకోన్నారు. శారీరక సాక్షరత యొక్క ప్రయోజనాలు కేవలం ఒక క్రీడారంగానికి కాదు యావత్తు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు ఒక దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే ముఖ్యమైన రంగాల్లో క్రీడారంగం ముందు స్థానంలో నిలుస్తుందని ఆయన అన్నారు ఆరోగ్యవంతమైన సమాజం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎ. సోనిబాలా దేవి, ఐఎఫ్‌ఎస్ మాట్లాడుతూ, క్రీడల్ని ప్రోత్సహించే రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ స్థాయిలో క్రీడల ప్రోత్సాహంపై ప్రభుత్వ దృష్టికోణాన్ని వివరించారు.
“యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్–2026” ద్వారా శారీరక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, క్రీడల్లో సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, సమగ్ర కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని క్రీడా ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు.
ఈ కార్యక్రమం లో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు సుజాత, రవితేజ, గచ్చిబౌలి స్టేడియం అడ్మిన్స్టేటర్ కన్నం మధు, కోచ్ లు యువ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.














